ఫైటింగ్ కి రెడీ.. ఏ స్టయిల్లో అయినాసరే.

  0
  44

  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఢంకా భజాయించి గెలవబోతుందని, మనం అధికారంలోకి రాబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాసిపెట్టుకోండి, మనమే అధికారంలోకి రాబోతున్నాం అని అన్నారు. వైసీపీతో తాము యుద్ధం కోరుకోలేదని, వైసీపీ నాయకులే తనని యుద్ధానికి పిలిచారని, ఈ యుద్దం ఎలా కావాలో, ఏ రూపంలో కావాలో చెప్పండని సవాల్ విసిరారు.

  యుద్ధానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. బజారులో తేల్చుకుందాం, మీరో మేమో.. రండి, అటో ఇటో తేల్చేస్తా అని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసేవారి చిట్టా అంతా రాసుకుంటున్నామని అన్నారు. తాటతీసి పంపిస్తానంటూ హెచ్చరించారు. సన్నాసులు, దద్దమ్మలు, చవటలు, వెధవలు అంటూ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

  మహిళలపై దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారని, మీకు ఆడపిల్లలు లేరా, మీకు తల్లులు లేరా, అక్కచెల్లెళ్లు లేరా అంటూ నిలదీశారు. తనకు చావంటే భయం లేదని, రివాల్వర్ కూడా ఎప్పుడో పోలీసులకే అప్పగించేశానని అన్నారు. ఇప్పటి వరకూ తాను రాజకీయం మొదలు పెట్టలేదని, ఇప్పుడిక అసలు రాజకీయం చూపిస్తానని అన్నారు పవన్.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.