చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారం ఇది..

  0
  164

  చుండ్రుతో బాధపడేవారు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆఖరికి డాక్టర్ని కలసి మందులు కూడా వాడుతుంటారు. అయితే ఇంట్లోనే చుండ్రుకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు, ఇకపై మీకెప్పుడు చుండ్రు రానంటే రాదు.


  డ్రై స్కిన్, తరచూ తలస్నానం లేక పోవడం వంటివి చుండ్రు రావడానికి గల కొన్ని కారణాలు. జుట్టు ఎంత ఒత్తుగా, పొడుగ్గా ఉన్న చుండ్రు వల్ల దాని అందం పోవడమే కాకుండా వెంట్రుకలు బలహీనం అవుతాయి, రాలిపోతాయి కూడా. చుండ్రును తగ్గించడానికి ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ను ఒకసారి ట్రై చేయండి.

  కొన్ని వేపాకు ఆకులు తీసుకొని వాటిను శుభ్రం చేసుకోవాలి. మిక్సీలో వేసి, కొంత పుల్లటి పెరుగు, తేనె కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ ప్యాక్ ని తలస్నానం చేసిన తర్వాత వెంట్రుకలకు పట్టించాలి. వెంట్రుకలతోపాటు తలపై ఉన్న చర్మానికి తాకేలా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ఎండిపోయే వరకు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు తరచుగా పెట్టుకుంటుంటే చుండ్రు ఈటె మాయమైపోవడం ఖాయం.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.