మీ గుండె జాగ్రత్తగా ఉందేమో చూసుకోండి ..ఇలా..

    0
    224

    కొవిడ్ వ్యాధి సోకినవారు ఆస్పత్రిలో చేరి చికిత్సపొంది డిశ్చార్జి అయితే ప్రతి ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందేనని అంతర్జాతీయ వైద్య పరిశోధన సంస్థలు సూచిస్తున్నాయి. యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం కొవిడ్ సోకినవారిలో 75నుంచి 80శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం లేకుండా పోతోందని, అయితే భయంతో వారు ఆస్పత్రుల్లో చేరుతున్నారని అన్నారు. తీవ్రమైన సమస్యలతో ఇతరత్రా వ్యాధులున్నవారికి దీర్ఘకాలంపాటు కొవిడ్ సోకితే వారికి అది నయమై ఇంటికి చేరినప్పటికీ ప్రతి ఆరు నెలలకోసారి పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచించారు.

    కొవిడ్ ఒకసారి సోకిన తర్వాత అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించి, ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయితే, ఎంతో కొంత శాతం ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన కండరాలు, వ్యవస్థను కొంతవరకు దెబ్బతీస్తుందని అన్నారు. అందువల్లనే కొవిడ్ తర్వాత వచ్చే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారని తెలిపారు. కొవిడ్ వైరస్ ACE-2 రిసెప్టర్ సెల్స్ లోకి చొరబడి హాని చేసే గుణం ఉందని, ఇది గుండె జబ్బులకు దారి తీస్తుందని కూడా అన్నారు. దీన్ని మయో కార్డీటిస్ అంటారని, ఇది ఒక్కోసారి గుండె వైఫల్యానికి కూడా దారి తీయొచ్చని యూరోపియన్ హార్ట్ జర్నల్ పేర్కొంది.

    కొవిడ్ ఒకసారి వచ్చిపోయిన వారికి, ఒకవేళ దాహం అనిపిస్తే ఎక్కువగా మంచినీరు తాగాలని, వెంటనే డాక్టర్ కి చూపించుకోవాలని, దీన్ని పాట్స్ సిండ్రోమ్ అని అంటారని చెప్పారు. గుండె లయ తప్పడం, శ్వాస పీల్చుకోవడం కష్టం కావడం, తలతిరగడం నిలబడినప్పుడు తోసేస్తున్నట్టు అనిపించడం, కళ్లముందు తెరలు కమ్ముకున్నట్టు అనిపించడం, ఛాతీలో నొప్పి, నాడి కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కొవిడ్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుందని అందువల్ల జాగ్రత్తగా ప్రతి ఆరు నెలలకు గుండె పరీక్షలు చేయించుకోవాలి సూచించారు.

    ఆహారం విషయంలో కూడా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలని, జంక్ ఫుడ్స్, కృత్రిమ రంగులు, ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్, మసాలాలు ఎక్కువ, నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదని, మద్యపానం, ధూమపానం పూర్తిగా ఆపివేయాలని తెలిపారు. ఏమాత్రం చిన్న లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని వివరించారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.