పవర్ లేనివాణ్ణి ,పవర్ స్టార్ ఏందయ్యా..

  0
  283

  పవర్ లేనివాణ్ణి ,పవర్ స్టార్ ఏందయ్యా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను విసుక్కున్నారు. రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ మాట్లాడుతూ సీఎం , సీఎం అని అరవద్దు.. ప్రజలకోసం పనిచేయడమే మన పని అని అన్నారు. తేజ్ పై కధనాలు మానేసి , ఇడుపులపాయలో నేలమాళిగల్లో ఉన్న నిధులు గురించి రాయండి అని మీడియాకి చెప్పారు. అలా రాస్తే , మిమ్మల్ని కొడతారని భయమని అన్నారు. తేజ్ ఇంకా కళ్లుతెరవలేదని అన్నారు. మీడియా రాయలసీమలో బలిజ కులస్తుల అణచివేత గురించి ఎందుకు మాట్లాడారని నిలదీశారు. తమ సినిమాలు ఆడకూడదనే ఆంధ్రలో థియేటర్లు తీయలేదని అన్నారు. జనాలకు వినోదం పంచి తాము డబ్బులు సంపాదిస్తున్నామని అన్నారు. ప్రభాస్ కండలు పెంచి, జూనియర్ ఎన్టీయార్ డాన్సులేసి , రామ్ చరణ్ స్వారీ చేసి , ఎన్నో రిస్కులు తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. రాజకీయనాయకుల్లాగా తేరగ్గా డబ్బులు రావని అన్నారు. దేశంలో ఎక్కువ టాక్స్ కట్టేదికూడా సినిమా ఇండస్ట్రీ వాళ్లేనని అన్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.