కారు పార్కింగ్ స్పేస్ 9 కోట్ల 43 లక్షలు..నమ్మాల్సిందే.

  0
  77

  కారు పార్కింగ్ చేసుకునేందుకు అపార్టుమెంట్‌లోనో… వేరే ప్రాంతంలోనో… స్థ‌లం కొనాల్సి వ‌స్తే… మ‌హా అయితే మూడు నాలుగు ల‌క్ష‌లు అవుతుంది. కానీ హాంకాంగ్ లో 9 కోట్ల 43 ల‌క్ష‌ల రూపాయ‌లు అమ్ముడుపోయింది. ఇది రికార్డ్. మౌంట్ మిక‌ల్స‌న్ అనే ప్రాంతంలో పార్కింగ్ స్పేస్ ఇంత ధ‌ర పోయింది. ఇంత ధ‌ర పెట్టి పార్కింగ్ స్పేస్ ఎవ‌రూ కొన‌లేదు.

  134 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. గ‌తంలో కారు స్పేస్ కోసం ఆరు కోట్ల 16 ల‌క్ష‌లు పెట్టి హాంకాంగ్ లోనే కొన్న‌ది ప్ర‌పంచంలోనే రికార్డుగా ఉండేది., ఇప్పుడా రికార్డు బ‌ద్ద‌లైంది. మౌంట్ నిక‌ల్స‌న్ లో ఈ ప్రాంతానికి ఆసియాస్ ప్రెజియ‌స్ట్ అడ్రెస్ అనే పేరుంది. 2017లో ఇక్క‌డ అపార్టుమెంట్ల‌ను నిర్మించారు. ఒకే వ్య‌క్తి రెండు అపార్టుమెంట్ల‌ను 1093 కోట్ల‌కు కొన్నాడు, దీన్ని బ‌ట్టి హాంకాంగ్ లో జీవితం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..