కాళ్లకు సంకెళ్లు వేసి గుంటలో దోసి చంపేవారా..?

  0
  49

  గ‌త‌కాల‌పు బానిస బతుకుల దుర్భ‌ర జీవితానికి ఈ సంకెళ్ళు సాక్ష్యం. రోమ్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో పేద‌ల‌ను బాసిన‌లుగా చేసి ఎంత నీచంగా, క‌ర్క‌శంగా చూసేవారో ఈ సంకెళ్ళు చెబుతున్నాయి. గ‌తంలో రోమ‌న్ల పాల‌న‌లో ఉన్న బ్రిట‌న్ లోని రుక్లాండ్ లో ఓ ఇంటి మ‌ర‌మ్మ‌త్తుల కోసం త‌వ్వుతుండ‌గా ఒక అస్తిపంజ‌రం కాళ్ళ‌కి వేసివున్న ఈ సంకెళ్ళు బైట‌ప‌డ్డాయి.

  దాదాపు 1800 ఏళ్ళ క్రితం నాటి రోమ్ చ‌క్ర‌వ‌ర్తుల దుర్మార్గాల‌కు ఇది నిద‌ర్శ‌నం. రోమ్ పాల‌న‌లో బానిస బ‌తుకుల ద‌య‌నీయ క‌ధ‌లు చ‌రిత్ర‌లో కోకొల్ల‌లు. పురావ‌స్తు ప‌రిశోధ‌కులు, ఆంత్రోపాల‌జిస్టులు సంకెళ్ళ‌తో దొరిక‌న ఈ అస్తిపంజ‌రంపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. కాళ్ళ‌కు ఈ సంకెళ్ళు వేసి బ‌తికున్న మ‌నిషిని అలాగే గోతిలో పాతేశార‌న‌డానికి ఇదో నిద‌ర్శ‌నం. ఈ సంకెళ్ళు, అస్థిపంజ‌రంపై జ‌రిపిన రేడియో కార్బ‌న్ ప‌రీక్ష‌ల్లో క్రీస్తు శ‌కం 226-427 మ‌ధ్య కాలం నాటిద‌ని తేల్చారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..