ఏ కూతురికి ఇలాంటి శిక్ష వేయరు..

  0
  6224

  13 ఏళ్ళ కూతురు , స్కూల్ కి పోదు. మాట వినదు.. గదిలోనుంచి బయటకు రాదు. మొబైల్ ఫోన్ తోనే జీవితం.. విసిగిపోయిన తల్లితండ్రులు ఏమిచేశారో చూడండి.. ఆమెను దారికి తీసుకురావాలని మనుషులు లేని ఒక దీవిలో వదిలేసి వచ్చేసారు. చైనాలోని షాన్ డాంగ్ ప్రాంతంలో రుషన్ సిటీ సముద్రం మధ్యలో ఈ దీవి ఉంది.. తల్లీతండ్రులు ఆ అమ్మాయిని పడవలో తీసుకుపోయి వదిలేసి వచ్చేసారు. 5 బిస్కెట్ ప్యాకెట్లు , మంచినీళ్లు మాత్రమే ఇచ్చివచ్చారు.

  అయితే , ఆ అమ్మాయి కొంతమంది సముద్రంలో వేటలో ఉన్న మత్స్యకారులకు తన బట్టలు విప్పి సిగ్నల్ ఇచ్చింది. తర్వాత వాళ్ళు ఈ విషయం పోలీసులకు చెప్పారు. పోలీసు అక్కడకొచ్చి , అమ్మాయి పరిస్థితి గమనించి , దీవికి తల్లితండ్రులను రప్పించారు. ఇలా అయినా తమ బిడ్డ బాగుపడుతుందని , దారికొస్తుందని ఇలాంటి , ద్వీపాంతర శిక్ష వేశామని చెప్పారు. తమ కూతురు ప్రవర్తనతో విసిగిపోయామని అన్నారు.. అయితే , అమ్మాయి అక్కడే రజస్వల కావడంతో , తల్లితండ్రులు తమ వెంట తీసుకెళ్లారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.