ఆమె ఒకప్పుడు సెలెబ్రిటీ.. ఇప్పుడు ఇలా వీధిలో..

    0
    1193

    దిల్ రాజ్ కౌర్ .. ఒకప్పుడు దేశంలో మార్మోగిన పేరు.. పారా ఒలింపిక్స్ తో సహా , అన్ని జాతీయ , అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ పోటీల్లో ఆమె విజేత.. 15 కి పైగా బంగారు , వెండి పతకాలు గెలిచింది.. అనేక సెలెక్షన్ కమిటీలలో మెంబర్ గా కూడా ఉంది.. లా చదివింది.. కానీ ఇప్పుడేమి చేస్తుందో తెలుసా..? రోడ్డుపక్కన చిప్స్ అమ్ముకుంటుంది.. ఉదయం మార్కెట్లో , సాయంత్రం పార్కుల పక్కన ఇలా రోడ్డు మీదనే చిప్స్ అమ్ముకుంటుంది.. ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణికి ఇంత దుస్థితి , బహుశా మరే దేశంలోనూ ఉండదు.. తల్లి , తానూ పొట్ట నింపుకునేందుకే , ఆమె రోడ్డు పక్కన డెహ్రాడూన్ లో ఇలా చిప్స్ అమ్ముకుంటుంది..

    గత ఏడాది తండ్రి కరోనా కాటుకు బలయ్యాడు.. సోదరుడు భవనం మీదనుంచి పడి తల దెబ్బతగిలింది.. రెండు నెలలు కోమాలోనే పోరాడి చనిపోయాడు.. దీంతో ఉన్న ఇల్లు , డబ్బు అయిపోయి , అప్పులపాలై వీధిన పడ్డారు.. చిన్న రేకులింట్లో తలదాచుకుని ఆకలి తీర్చుకునేందుకు ఇలా వీధిలో పల్లీలు , చిప్స్ అమ్ముకుంటున్నారు. ఇలాంటి క్రీడాకారులకు ఇతర రాష్ట్రాలలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిస్తున్నారు. కానీ ఉత్తరాఖాండ్ లో మాత్రం దిల్ రాజ్ కౌర్ ఇలా కడుపుకూటి కోసం వీధిలో పల్లీలు , చిప్స్ అమ్ముకుంటోంది.. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో దిల్ రాజ్ కౌర్ కు ఉద్యోగం కల్పించే అవకాశం పరిశీలిస్తామని ఉత్తరాఖండ్ క్రీడల మంత్రి చెప్పారు..

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..