ఆమెకు కామం తలకెక్కింది-భర్తను చంపేసింది.

  0
  35786

  50 ఏళ్ళ వయసులో ఆమెకు కామం తలకెక్కింది.. పెళ్ళికెదిగిన బిద్దలు ముగ్గురున్నా , సిగ్గు బిడియం లేకుండా 27 ఏళ్ళ యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. దానికి అడ్డుగా ఉన్నాడని 54 ఏళ్ళ భర్తను చంపేసింది.. కర్ణాటకలోని మాండ్యలో జరిగిన ఈ ఘోర హత్య వివరాలిలాఉన్నాయి. మాండ్య గుట్టలులేవుట్ లో , కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న 54 ఏళ్ళ అల్తాఫ్ మెహదీ , 50 ఏళ్ళ రిజ్వానాలు భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు. రిజ్వానాకు ఇటీవల ఫేస్ బుక్ లో రహంతుల్లా సైదా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది చిన్నగా చాటింగ్ కి , తర్వాత అక్రమసంబంధానికి దారితీసింది.

  రిజ్వానా ఇంట్లో 4 లక్షలు తీసి , రహ్మతుల్లాకు టైల్స్ షాపుకూడా పెట్టించింది. ఇద్దరి మధ్య అక్రమసంబంధం బయటపడటంతో భర్త మందలించాడు. ఆమెను కట్టడిచేసారు. దీంతో భర్తను చంపేందుకు పధకం వేసింది. శనివారం అతడు నిద్రపోతున్న సమయంలో , ఇంటి తలుపుతీసి ప్రియుడిని లోపలకు పిలిచింది. భర్త ముఖం మీద దిండు అదిమిపెట్టి , ఊపిరాడకుండా చేసి చంపేసింది . ఉదయాన్నే భర్త గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే బంధువులు పోలీసులకు అనుమానం వ్యక్తంచేయడంతో విచారణలో కుట్ర బయటపడింది. రిజ్వానా, ఆమె ప్రియుడు రహ్మతుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.