ఆమ్మో ..నెల్లూరు సాఫ్ట్ వేర్ హిజ్రా..ఎంత పనిచేసావే .

  0
  10586

  ఆమ్మో ..నెల్లూరు హిజ్రా.. ఎంత పనిచేసావే .. అంటున్నారు అమలాపురం వాళ్ళు.. ఉద్యోగాలిప్పిస్తానని నకరికంటి శివదినేష్‌ (33) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.15 లక్షలు కొట్టేశాడు.. శివదినేష్ హిజ్రా.. ఆడగొంతులాగానే ఉంటుంది.. అదే అతని మోసాలకు వరమైంది..ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది నిరుద్యోగుల మొబైల్ నంబర్లు సేకరించాడు. కరోనా కాలంలో ఇంటివద్దనే ఉంటున్న వారికి కాల్స్ చేసేవాడు. ఆన్ లైన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని నమ్మించేవాడు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలున్నాయని చెప్పేవాడు.. అలా మెల్లగా ముగ్గులోకి దింపేవాడు.. ఇలా తూర్పుగోదావరి జల్లాలోనే ఆరు మందిని మోసంచేసి , సాఫ్ట్ వేర్ ఉద్యోగాలని చెప్పి 15 లక్షలకు పైగా కొట్టేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన వారు అమలాపురం , అంబాజీపేట ప్రాంతాల్లో ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ , బ్యాంక్ ఆన్ లైన్ అకౌంట్లు పరిశీలిస్తే , నెల్లూరు అని తేలింది. అంతవరకు తమతో మాట్లాడింది అమ్మయేనని అనుకున్నవారికి , సాఫ్ట్ వేర్ హిజ్రా తమను ఆడగొంతుతో గోతిలోకి తోశాడని అర్థమైంది.. దీంతో పోలీసులు నెల్లూరుకొచ్చి శివదినేష్‌ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.