ఇక నుంచి ఆ స్కూటర్ కి రివర్స్ గేర్ ..

  0
  161

  ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత్ లో దుమ్మురేపనున్నాయి. ఇప్పటికీ చాలా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టాయి. అయితే ఇప్పుడు ఓలా కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను మనదేశంలో విడుదల చేయనుంది. ఈ స్కూటర్ దేశంలో సరి కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉండే టాప్ క్లాస్ ఫీచర్లు.. ద్విచక్రవాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్‌ మోడ్‌ను దీనిలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌లో రివర్స్ మోడ్ ఫీచర్‌ అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

  ఓలా స్కూటర్‌ను 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ చేయొచ్చు.. సగం ఛార్జింగ్‌తో 75 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. వీటితో పాటు తాళం చెవి లేకుండానే ఓ ప్రత్యేకమైన యాప్‌ ద్వారా స్కూటర్‌ను స్టార్ట్‌ చేసే అత్యాధునిక ఫీచర్‌ కూడా ఇందులో ఉండటం విశేషం..
  ఏడు అంగుళాల ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లే, జీపీఎస్ నావిగేష‌న్‌ కూడా ఈ స్కూటర్ స్పెషాలిటీల్లో ఒకటి.. బ్లూటూత్ ద్వారా 4జీ క‌నెక్టివిటీ సౌకర్యం, అతి పెద్ద క్లాస్ బూట్ స్పేస్, యాప్-బేస్డ్ కీలెస్ యాక్సెస్, సెగ్మెంట్-లీడింగ్ రేంజ్ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్ ముస్తాబవుతోంది. డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీట్, ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, ఎల్‌ఇడి టైల్లైట్, సామాను తీసుకెళ్లేందుకు హుక్, స్ప్లిట్-టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్ ఫ్లోర్ మత్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు కూడా ఇందులో ఉంటాయి.

  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ ఓలా స్కూటర్ ధ‌ర ల‌క్ష రూపాయ‌ల నుంచి లక్షా 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో లక్ష బుకింగులు కూడా జరిగినట్టు కంపెనీ ప్రకటించింది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.