అమ్మాయిలకు ఈ రాశుల భర్తలుంటే అదృష్టమే..

  0
  155

  ఈ ప్రంపంచంలో ప్రతి అమ్మాయీ తనకు మంచి భర్త రావాలని కలలు కంటుంది. తల్లిదండ్రుల ఆలన పాలన లోనుంచి పెళ్లై అత్తారింటిలో అడుగు పెట్టిన అమ్మాయిలు రంగు రంగుల కలలను, అందమైన జీవితాలను ఊహించుకుంటారు. ఈ ఊహలకు, ఆశలకు ఏ ఆడపిల్లా మినహాయింపు కాదు. అయితే చాలామంది విషయంలో ఈ కలలు, ఆశలు నిజమవుతాయి. కొద్దిమంది విషయంలో మాత్రం నిరాశే ఎదురవుతుంది. దీనికి జాతక ప్రభావమో, పూర్వజన్మ కర్మ ఫలితమో అని సరిపెట్టుకునేవారే ఎక్కువ. అయితే జాతక ప్రభావం అంటే కుజదోషం, కాలసర్ప దోషం ఉన్న ఆడపిల్లలకు సంబంధాలు చూసే విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జాతకాలను నమ్మేవారికి మాత్రం అమ్మాయిలకు కొన్ని రాశుల్లో పుట్టిన అబ్బాయిలు ఉత్తమ భర్తలుగా ఉంటారు. జాతక ప్రభావమైన దోషాలున్న అమ్మాయిలకు కూడా అటువంటి రాశులలో పుట్టిన అబ్బాయిలు సరిపోతారు. జాతక ప్రభావంలో దుష్ట ప్రభావం చాలా వరకు తొలగిపోతుంది. 12 రాశుల్లో ముఖ్యంగా 4 రాశులలో పుట్టిన అబ్బాయిలను ఉత్తమ భర్తలుగా పరిగణిస్తారు. వారు కర్కాటక, సింహ, తుల, వృశ్చిక రాశుల్లో పుట్టిన అబ్బాయిలు భర్తలుగా గ్రహ దోషాలు ఉన్న అమ్మాయిలకు ఉత్తమ భర్తలు అంటారు.

  కర్కాటక రాశిలో అబ్బాయిలు అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా ఉంటారు. తమ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీని కలిగి, సంబంధాలను ఆత్మీయంగా కొనసాగిస్తారు. ఈ రాశుల్లో పుట్టిన అబ్బాయిలు ముఖ్యంగా తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటారు. అందుకే వారు భార్యలను బాగా చూసుకుంటారు.

  సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు ధైర్యవంతులుగా ఉన్నా, కుటుంబ సంబంధాలు, వివాహ బంధాల విషయంలో చాలా సానుకూలంగా ఉంటారు. భార్యలను ప్రేమగా చూసుకుంటారు. వారిని సంతోష పెట్టేందుకు ఎటువంటి పనికైనా పూనుకుంటారు. ఎప్పుడూ భార్యలు తమ పక్కనే ఉండాలని కోరుకుంటారు.

  తుల రాశి అబ్బాయిలయితే భార్యలను జాగ్రత్తగా చూసుకుంటారు, శృంగారంలో ముంచెత్తుతారు. భార్య ఏదడిగినా కాదనకుండా తీసిస్తారు. అన్ని కోర్కెలు నెరవేరుస్తారు.

  వృశ్చిక రాశి అబ్బాయిలయితే చాలా చురుకైన స్వభావంతో ఉంటూ మంచి హృదయం కలిగి ఉంటారు. భార్యల సంతోషమే ముఖ్యంగా భావిస్తారు. వారికోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే విధంగా ప్రేమిస్తారు. ఎప్పుడూ భార్యలను అమటి పెట్టుకునే ఉంటారు. ఇవి గ్రహ దోష ప్రభావాలున్న అమ్మాయిలకు సరిపోయే గ్రహాల అబ్బాయిల రాశులు, వారి స్వభావాలు.

   

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.