ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ ఆఫర్లు..

  0
  951

  దేశవ్యాప్తంగా పెట్రోలు రేట్లు ఆకాశానికంటుతున్న వేళ, బైక్ బయటకు తీయాలంటేనే మధ్యతరగతి వారు హడలిపోతున్నారు. దీంతో ఇటు ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగిపోతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు మాత్రం ఇంకా దిగిరాలేదు. తాజాగా.. ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ కోమకి తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కోమకి ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో ఓ కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ఫిబ్రవరి 2021నుంచి కేరళ,గుజరాత్,కర్ణాటక,పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో డీలర్‌ షిప్‌ లను ప్రారంభించి తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.

  ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో బ్యాటరీలపై అందించే సబ్సిడీని మరింత పెంచింది.ఫేమ్-2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహన తయారీసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఇటీవల భారత ప్రభుత్వం సవరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్‌ లో ప్రోత్సాహకాలను కిలోవాట్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 పెంచింది. ఈ ప్రోత్సాహకాలు పెరగడంతో తయారీకంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి.

  ఈ ప్రయోజనంతో కొత్తగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు లబ్ధి పొందనున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవే కాకుండా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ టూవీలర్లతో పోల్చుకుంటే, లాంగ్ రన్‌లో ఇవి కస్టమర్లకు ఎక్కువ నగదు ప్రయోజనాలను అందిస్తాయి. కోమకి అందిస్తున్న పెద్ద ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ టిఎన్-95‌పై లభించే సబ్సిడీ విషయానికి వస్తే, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.20,000 సబ్సిడీని అందిస్తోంది. అదే సమయంలో, కోమకి ఎస్‌ఇ ధర రూ.15,000 తగ్గుతుంది. కోమకి 2021 నాటికి భారత మార్కెట్లో 14,500 లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..