గోల్డ్ మెడల్ తెస్తే మూడు కోట్లిస్తా..

  0
  468

  త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న మార్క్ చూపిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చీరాగానే త‌మిళ ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. తాజాగా క్రీడాకారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జులై 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రీడల్లో భారతదేశం నుంచి 102 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 14 ఈవెంట్స్ లో త‌మ స‌త్తా చాటేందుకు స‌న్న‌ద్ద‌మ‌య్యారు.

  ఈ నేప‌ధ్యంలో ఒలింపిక్ క్రీడ‌ల్లో స్వ‌ర్ణ‌ప‌త‌కాన్ని సాధించే క్రీడాకారుల‌కు 3 కోట్లు, ర‌జ‌త‌ ప‌త‌కం సాధించే క్రీడాకారుల‌కు 2 కోట్లు, కాంస్య ప‌త‌కం సాధించే క్రీడాకారుల‌కు 1 కోటి న‌జ‌రానా ఇస్తామ‌ని స్టాలిన్ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఒలింపిక్ క్రీడ‌ల్లో పాల్గొనే క్రీడ‌డాకారుల‌తో పాటు దేశంలో ఉండే క్రీడాకారుల‌కు ఉత్సాహం నింపింది. ఆయ‌న ప్ర‌క‌ట‌న ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్సం వ్య‌క్త‌మ‌వుతోంది.

  ఇదిలావుంటే హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కూడా క్రీడాకారుల‌కు మంచి ఉద్యోగాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 2012లో జ‌రిగిన ఒలింపిక్ క్రీడ‌ల్లో భార‌త్ 6 ప‌త‌కాలు సాధించింది. ఈసారి మ‌రిన్ని ప‌త‌కాలు సాధించి, భార‌త కీర్తిని దిగంతాల‌కు ఎగుర వేయాల‌ని ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..