పెళ్లి విందులో మటన్ పెట్టలేదని పెళ్లి క్యాన్సిల్..

  0
  836

  పెళ్లి విందులో మటన్ పెట్టలేదని పెళ్ళికొడుకు పెళ్లి క్యాన్సిల్ చేశాడు . మటన్ లేని పెళ్ళివిందు తమను అవమానించడమేనని , తిడుతూ తన బంధువర్గంతో వెళ్ళిపోయాడు. మటన్ పెట్టి మర్యాదచేయలేని ఇంట్లో పిల్ల, పెళ్లికూడా వద్దన్నాడు,ఒరిస్సాలోని సుకిందర్ అనే గ్రామంలో జరిగిందీ ఘటన. రమాకాంత్ పాత్ర అనే ఈ పెళ్ళికొడుకు , బంధుమిత్ర సమేతంగా పెళ్లికూతురు ఇంటికి వచ్చాడు. రాత్రి 9 గంటలకు పెళ్లి . ఈ లోగా విందు ఏర్పాట్లు జరిగాయి. అందరూ భోజనానికి కూర్చున్నారు. అయితే విందులో మటన్ కర్రీ లేకపోవడంతో పెళ్ళికొడుకు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఈ పెళ్లి తనకొద్దంటూ అరిచి , అలిగి వెళ్ళిపోయాడు. అదే ఊరిలో తమ బంధువుల ఇంటికి పెళ్ళికొడుకు తరపు వారంతా పోయారు. అదే రాత్రి మరొక అమ్మాయిని చూసి తాళి కట్టేశాడు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..