పెళ్ళంటే నూరేళ్ళ మంట అంటోంది కీర్తి.

  0
  575

  పెళ్ళంటే నూరేళ్ళ పంట అని పెద్ద‌ల వాక్కు. కానీ పెళ్ళంటే నూరేళ్ళ మంట అంటోంది బాలీవుడ్ యాక్ట్రెస్ కీర్తి కుల‌హ‌రి. పెళ్ళంటేనే ఒళ్ళంతా మంట‌. తేళ్ళు జెర్రెలు పాకిన‌ట్లు ఉంటుంది. పెళ్ళి అనేది పెద్ద ట్రాష్ అంటూ ఊక‌దంపుడు దంచుతోంది. రెండు కుటుంబాల‌ను క‌లుపుతుందేమోగానీ, రెండు మ‌న‌సులు క‌లిపేది పెళ్ళి కాదంటూ కొత్త అర్దం చెబుతోంది.

  ఇక‌పై తాను పెళ్ళికి పూర్తిగా వ్య‌తిరేకిన‌ని, కావాల‌నుకుంటే ఓ పార్ట‌న‌ర్ తో క‌లిసి ఉంటాన‌ని అంటోంది. ఇష్టం ఉన్న‌న్ని రోజులు పార్ట‌న‌ర్ తో ఉంటాన‌ని, క‌ష్ట‌మైన రోజు మ‌రో పార్ట‌న‌ర్ ని వెతుక్కుంటాన‌ని చెప్పింది. అంతేగానీ పెళ్ళి జోలికి మ‌ళ్ళీ పోన‌ని తెగేసి చెప్పింది.

  2016లో న‌టుడు సాహిల్ సెహ‌గ‌ల్ ను పెళ్ళి చేసుకున్న కీర్తి… ఈ ఏడాది ఏప్రిల్ తో అత‌నితో విడిపోయింది. తాజాగా పెళ్ళిపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది. అయితే పెళ్ళిపై ఆమె చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..