12 బాటిల్స్ వైన్ తాగింది మనుషులా ? ఎలుకలా ?

  0
  273

  ఆ మందు తాగింది ఎవరు..? మనుషులా .. ? ఎలుకలా ..? ఒకటి కాదు , రెండుకాదు ఏకంగా 12 బాటిల్స్ వైన్ ఖాళీ అయింది.. ఇదికూడా ఎక్కడో కాదు.. తమిళనాడులోని నీలగిరి జైళ్ల కేంద్రంలో.. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆద్వర్యంలోని టాస్మాక్ బ్రాందీ షాపులు మూసేసారు. ఇప్పుడు షాపులు తెరవడంతో , అధికారులు స్టాక్ తేల్చే పనిలో పడ్డారు. 12 వైన్ బాటిల్స్ ఖాళీగా కనిపించాయి.. షాపుకు వేసిన తాళాలు వేసినట్టేఉన్నాయి.. 12 బాటిల్స్ లో వైన్ ఖాళీ అయింది .. ఇక బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకని , ఈ మందు ఎలుకలే తాగేశాయన్న నిర్దారణకు వచ్చేసారు. బాటిల్స్ మూతలు చూసి , ఇది ఎలుకలు చేసిన పనేనని తేల్చేశారు. గతంలోకూడా బీహార్ , ఏపీ , కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎలుకలు విపరీతంగా మందు తాగేస్తున్నాయని చూపిన సంఘటనలు ఉన్నాయి.. నిజం దేవుడికే తెలియాలి..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.