అమరవీరుడి భార్య.. ఇప్పుడు వీర సైనికురాలు..

  0
  32

  2019లో పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో అమరుడైన విభూతి శంకర్ దౌండియాల్ భార్య.. నికితా కౌల్ దౌండియాల్ లెఫ్ట్ నెంట్ హోదాలో ఆర్మీలో చేరబోతోంది. ఇటీవలే చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆమె తన శిక్షణ పూర్తి చేసుకుంది.

  పుల్వామా దాడిలో చనిపోయిన మేజర్ దౌండియాల్ కి అప్పటికి 34ఏళ్లు. నికితాతో వివాహం అయి కేవలం 9నెలలు గడిచింది. పుల్వామాలో జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రవాదుల చేతిలో ఆయన దుర్మరణంపాలయ్యారు. ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చిన సందర్భంలో నికితా ధైర్యం అందర్నీ అబ్బురపరచింది. కన్నీటితో బేలగా మారకుండా.. తన భర్త మృతదేహాన్ని చూసి సెల్యూట్ చేసింది. ఐ లవ్యూ అని చెప్పింది. తాను కూడా భర్త లాగే ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తానంటూ ఆనాడే నిర్ణయించుకుంది నికితా కౌల్ దౌండియాల్.

  షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షపాసయింది, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూలో కూడా సెలక్ట్ అయింది. అనంతరం చెన్నాైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరబోతోంది నికిత.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..