ఆల్భా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్.. లాంబ్డా..

  0
  511

  కరోనా కొత్త వేరియంట్ లామ్డా ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. పెరూలో వెలుగు చూసిన ఈ ఉత్పరివర్తనం ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటినా సహా 29దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించింది. అటు బ్రిటన్ లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సంస్థ కూడా పరిశోధనలో ఉన్న కరోనారకంగా దీన్ని వర్గీకరించింది. దీని స్పైక్‌ ప్రొటీన్‌ లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
  చిలీలో భారీగా పెరిగిన కేసులు..
  ఏప్రిల్‌ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్‌ కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం. గత 60 రోజుల్లో ఇది చిలీలో 32 శాతానికి పెరిగింది. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్‌ఈ పేర్కొంది. అయితే దీని స్పైక్‌ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.