ఉగ్రకుట్ర విఫలమైనా సరిహద్దుల్లో భయం భయం..

  0
  148

  కాశ్మీర్ లో ఉగ్రవాదులు డ్రోన్ సహాయంతో విధ్వంసానికి వ్యూహరచన చేశారని స్పష్టమైపోయింది. జమ్మూ వైమానిక స్థావరానికి సమీపంలో కూలిపోయిన డ్రోన్ లో 6 కిలోల పేలుడు పదార్థాలున్నాయి. ఇది లష్కర్ ఎ తొయిబా తీవ్రవాదుల కుట్రేనని స్పష్టమవుతోంది.

  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్ బేస్ లోని హెలికాప్టర్ల విధ్వంసం లక్ష్యంగానే ఈ డ్రోన్ అటాక్ కు వ్యాహూం పన్నినట్టు భావిస్తున్నారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మూడు డ్రోన్లను ఒక్కోదాన్ని 50 గజాల దూరంలో ప్రయోగించాలని వారు వ్యూహం పన్నారు. జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా దీన్ని కచ్చితమైన ప్రదేశంలో పేల్చాలని చూశారు. అతి పెద్ద విధ్వంసం సృష్టించే ఈ డ్రోన్ బాంబుల దాడి కేవలం వాతావరణం ప్రతికూలం కారణంగానే తప్పిపోయింది.

  ఈ డ్రోన్ లు ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఈ దాడితో సరిహద్దుల్లో మరింత నిఘా పెంచాయి భద్రతా దళాలు. డ్రోన్ల వ్యవహారంపై దృష్టిపెట్టాయి. రాడార్ల కన్నుగప్పి వచ్చే ఈ డ్రోన్లను పర్యవేక్షించేందుకు ప్రత్యే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.