భారత్ లో భారీగా పడిపోయిన కొత్త కేసులు..

    0
    79

    భారత్ లో కొవిడ్ కేసులు 2 నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఓ దశలో 4 లక్షలు దాటి భయపెట్టిన కేసులు ఇప్పుడు లక్షకు చేరుకున్నాయి. తాజాగా 1,00,636 మందికి కరోనా సోకింది. క్రితం రోజుతో పోల్చితే 12 శాతం తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీ రేటు 94శాతానికి చేరువైంది. మొత్తం రికవరీలు 2.7కోట్ల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 1,74,399 మంది కోలుకున్నారు.

    రికవరీ రేటు 94 శాతానికి చేరువగా కాగా..క్రియాశీల రేటు 5శాతం దిగువకు నమోదైంది. ప్రస్తుతం 14,01,609 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోవైపు ఆదివారం 13.90లక్షల మందికి టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లకు పైబడింది.
    ఇప్పటివరకు భారత్ లో మొత్తం 2,89,09,975 మంది వైరస్ బారిన పడగా.. 3,49,186 మంది చనిపోయారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..