చీరెతో నో ఎంట్రీపై మహిళా కమీషన్ విచారణ..

  0
  99

  చీర‌తో వ‌చ్చిన అనితా చౌద‌రి అనే మ‌హిళ‌ను ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్ లోప‌లికి అనుమ‌తివ్వ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హ‌జ్వాల‌లు రేగాయి. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా తీసుకుంది. రెస్టారెంట్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. భార‌తీయుల సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ అయిన చీర‌తో వ‌చ్చిన ఆ మ‌హిళ హ‌క్కును రెస్టారెంట్ యాజ‌మాన్యం భంగం క‌లిగించిందంటూ మండిప‌డింది. స‌ద‌రు రెస్టారెంట్‌పై ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ ను ఆదేశించింది. ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలని రెస్టారెంట్ మార్కెటింగ్, ప్రజా సంబంధాల డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.