కియా ,హ్యుండాయ్ ఎలెక్ట్రిక్ కార్లు రెడీ..

  0
  412

  ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్..రైడింగ్ కోసం సిద్ధంగా ఉండండి..
  దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం భారీగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ఈ తరహా వాహనాలకు ప్రజల మద్దతు కూడా బాగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే వాహన తయారీ కంపెనీలు కూడా విద్యుత్‌ వాహనాలకు సంబందించి తమదైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే, వాతావరణ మార్పుల ప్రభావం కూడా విద్యుత్‌ వాహనాల అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో వారానికి ఒక కొత్త వాహనం విడుదల అవుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి రాబోయే మూడు ఏళ్లలో మనదేశంలో హ్యుందాయ్, కియా రెండూ ఒక్కొక్కటి మూడు ఈవీలను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది.

  వచ్చే ఏడాది ఎప్పుడైనా మార్కెట్లోకి హ్యుందాయ్ అయోనిక్ 5, కియా ఈవి6 కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు మోడల్స్ 18 నిమిషాలలోపు 80 శాతం ఛార్జ్ చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్ కోనా ఈవిలో మరో మోడల్ ను ఈ సంవత్సరం చివర్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు, కియా ఈ-నీరో రెండు కార్లు 39.2కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 136 హెచ్‌పీ మోటార్ లేదా 64కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 204 హెచ్‌పీ మోటార్ తో వస్తాయని సమాచారం. ఈ-నీరో వరుసగా 289 కిలోమీటర్లు, 455 కిలోమీటర్ల పరిధితో వస్తే, కోనా 305 కిలోమీటర్లు, 484 కి.మీ పరిధితో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్లు సాధారణ, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటాయా.. లేదా.. అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.