నయనతార, విఘ్నేష్ పెళ్లి అప్పుడే..

  0
  198

  నయనతార, విఘ్నేష్ పెళ్లికి రెడీ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ.. చెట్టపట్టాలేసుకుని చాలా ప్రాంతాలు తిరిగారు. పెళ్లికి ముందే గుడులు, గోపురాల్లో పూజలు కూడా చేశారు. ఇటీవలే విఘ్నేష్ తన ఇంటికి తీసుకెళ్లి మరీ ప్రియురాలిని తల్లికి పరిచయం చేశాడు.


  త్వరలోనే పెళ్లి..
  చాలాకాలం నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు విఘ్నేష్. అందులో భాగంగా అభిమానులు అడిగే పలు ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్తున్నాడు.

  తాజాగా జరిగిన చాట్ సెషన్ లో నెటిజన్లు ఆయనను పెళ్ళి గురించి ప్రశ్నించగా… వివాహం ఖరీదైనదని, ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కోవిడ్ -19 మహమ్మారి పూర్తిగా తగ్గిన తరువాత ఈ లవ్ బర్డ్స్ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ను ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా షూటింగ్‌లో కలిశారు నయనతార. తరువాత వారి బంధం ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్ళెప్పుడు జరుగుతుందో చూడాలి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.