సమంత – చైతు బ్రేకప్ పై నాగార్జున మాట ఇదీ..

  0
  1258

  టాక్ ఆఫ్ ద టౌన్ నిలిచిన స‌మంత‌-నాగ‌చైత‌న్య వ్య‌వ‌హారం… వారిద్ద‌రి ప్ర‌క‌ట‌న‌తో ముగింపు ప‌లికిన‌ట్ల‌యింది. తాము విడిపోతున్నాం అని నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రూ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఇది అక్కినేని అభిమానుల్లో తీవ్ర నిరాశ‌ను నింపింది. అయితే తాము విడిపోయినా… త‌మ మ‌ధ్య ఉన్న‌ది ప్ర‌త్యేక‌మైన బంధ‌మంటూ పేర్కొన్నారు. తాజాగా ఈ విష‌యంపై అక్కినేని నాగార్జున స్పందించారు. ట్విట్ట‌ర్ లో భావోద్వేగ‌మైన పోస్టును పెట్టారు.

  ‘బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెపుతున్నా. సమంత, నాగచైతన్యల మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య, భర్తల మధ్య ఏం జరిగిందనేని వ్యక్తిగతం. వీళ్లిద్దరూ నాకు చాలా ఇష్టమైనవాళ్లు. సమంత మాతో గడిపిన ప్రతి క్షణం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ఎప్పుడూ మాకు ఆప్తురాలిగానే ఉంటుంది. నాగచైతన్య, సమంతలకు భగవంతుడు శక్తిని ప్రసాదిస్తాడని కోరుకుంటున్నా’ అని ఎమోష‌న‌ల్ గా ట్వీట్ చేశారు నాగ్‌.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.