కోవిడ్ థర్డ్ వేవ్ లక్షణాలతో పిల్లలు.. జాగ్రత్త.

    0
    67

    కోవిడ్ థర్డ్ వేవ్ లో ప్రవేశిస్తున్నామా ..? ఈ అనుమానం డాక్టర్లకే ఉంది.. సెకండ్ వేవ్ విషయంలోకూడా నిర్లక్ష్యం చేసి ఫలితం అనుభవించాం.. కానీ ఇప్పుడు కోవిడ్ థర్డ్ వేవ్ లో ప్రవేశిస్తున్నామా అన్న అనుమానానికి పిల్లల్లో ప్రబలుతున్న మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ నిదర్శం అని భావిస్తున్నారు. ఇది కరోనా నుంచి కోలుకొన్న 15 ఏళ్ల లోపు పిల్లలకు సోకుతున్న మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్(MIS-C) వ్యాధి.. మన రాష్ట్రంలో మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్(MIS-C) కేసులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి..దేశంలో ఇప్పటికే ఇలాంటి కేసులు 2 వేలు నమోదు అయ్యాయి. ఢిల్లీలోకూడా 200 మంది పిల్లలు ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారు.

    గుంటూరు జీజీహెచ్ లో ఐదుగురు చిన్నారులు చేరారు.. జ్వరం ,కడుపు లో ఉబ్బరం,వాంతులు, చర్మంపై దద్దుర్లు లాంటి లక్షణాలతో ఉన్న పిల్లలు MIS-C వ్యాధిగ్రస్తులుగా తేల్చారు. పోస్ట్ కోవిడ్ లో పిల్లలు మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ వ్యాధి బారిన పడుతున్నారని జీజీహెచ్ సూపరిడెంటెంట్ డాక్టర్ ప్రభావతి చెప్పారు. ఈ వ్యాధి తో శరీరంలోని వివిధ భాగాల్లో మంట వస్తాయి అన్నారు.. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెయిన్, చర్మం, కళ్లు, పొట్టలో అవయవాలకు ఈ మంట వచ్చే అవకాశం ఉందికోవిడ్ థర్డ్ వేవ్ లో ప్రవేశిస్తున్నాం అనేందుకు మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ నిదర్శం అన్న అనుమానం వ్యక్తం చేశారు.. పేరంట్స్ పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం వచ్చింది అన్నారు. పిల్లలను బయటకు పంపకండా.కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్నారు..

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..