ఎంపీ రఘురామ రాజుని ఇలా కొట్టారా..?

  0
  54

  అరెస్ట‌యిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ రాఘురామ‌కృష్ణ‌రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విచార‌ణ స‌మ‌యంలో సీఐడీ పోలీసులు త‌న‌ను కొట్టారంటూ జ‌డ్జికి ఫిర్యాదు చేశారు. హైకోర్టులో బెయిల్ నిరాక‌రించిన త‌ర్వాత ఆయ‌న‌ను పోలీసులు గుంటూరులోని అడిషిన‌ల్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచారు. దానికి ముందు సిఐడీ కార్యాల‌యంలోనే ఆయ‌న‌కు మెడిక‌ల్ టెస్టులు చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచిన‌ప్పుడు పోలీసులు త‌న‌ను కొట్టారంటూ చెప్పారు. ఇదిలా ఉండ‌గా మ‌ళ్ళీ ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎక్క‌డ ఉన్నారో తెలియ‌ద‌ని ఆయ‌న న్యాయ‌వాదులు హెబియ‌స్ కార్ప‌స్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై డివిజ‌న్ బెంచ్ లో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. పోలీసులు త‌మ‌కు కింది కోర్టుకు రానీయ‌కుండా అడ్డుకున్నార‌ని, ఆ త‌ర్వాత ర‌ఘురామ‌కృష్ణ‌రాజుని ఎక్క‌డికి తీసుకెళ్ళారో తెలియ‌దంటూ న్యాయ‌వాదులు పేర్కొన్నారు.

   

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.