తిండిపెట్టిన తల్లి శవయాత్రలో ఆ కుక్క..

  0
  99

  విశ్వాసానికి ప్ర‌తీక శున‌కం. అన్ని మూగ‌జీవాల్లో ఫ్రెండీగా ఉండేవి కూడా అవే. య‌జ‌మాని కోసం ప్రాణాల కోసం తన ప్రాణాల‌ను కూడా లెక్క చేయ‌వు ఆ మూగ‌జీవాలు. కాసేపు య‌జ‌మాని క‌న‌ప‌డ‌క‌పోతే త‌ల్ల‌డిల్లిపోతాయి. అలాంటి సంఘ‌ట‌నే ఇది కూడా. గుజ‌రాత్ రాష్ట్రంలోని సూర‌త్ లో పీయూష్ వ‌ర్షా సాధ్వీ మ‌హ‌రాజ్ వ‌ద్ద ఓ కుక్క ఉండేది. ఆ కుక్క‌కు ఆమే స్వ‌యంగా ఆహారం అందిస్తుండేది. ప్రేమ‌గా చూసుకునేది. ఆమెకు వందేళ్ళు. ఆమె చ‌నిపోవ‌డంతో ఆ కుక్క ప‌డిన బాధ వ‌ర్ణ‌నాతీతం.

   

  సాధ్వీ పార్థివ దేహాన్ని ఆమె శిశ్యులు పల్లికిలో మోసుకెళ్తూ అంతిమ యాత్ర నిర్వహించారు. ఆమె ఉండే ఇంటి నుంచి ఐదు కిలోమీట‌ర్ల దూరంలో శ్మ‌శానం ఉంది. అంత‌దూరం నిర్వ‌హించిన అంతిమ‌యాత్ర‌లో ఆ కుక్క కూడా పొల్గొంది. య‌జ‌మానురాలి వెంట ప‌రుగు తీసింది. పాడె మోస్తున్న శిష్యుల కాళ్ళుకు అడ్డుప‌డిన‌ప్పుడు, వాళ్ళు ఆ కుక్క‌ను ప‌క్క‌కు నెట్టివేసినా స‌రే… త‌న య‌జ‌మానురాలిని మాత్రం విడువ‌లేదు. శ్మ‌శానం వరకు నడిచింది. శ్మశానంలో సాధ్వీ అంత్య‌క్రియ‌లు పూర్తి చేసిన త‌ర్వాత శిష్యులంతా వెనుదిరిగినా, ఆ కుక్క మాత్రం అక్క‌డే ఉండి తన విశ్వాసాన్ని చాటుకుంది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.