దెబ్బలపై హైకోర్టు సీరియస్ – డ్రామా అన్న ఏఏజీ.

  0
  36

  ఎంపీ రఘురామకృష్ణమ రాజుని కస్టడీలో ఎలా కొడతారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన న్యాయవాదుల కోరిక మేరకు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి పంపాలని ఆదేశించింది. నిన్నలేని దెబ్బలు ఈ రోజు ఎలావచ్చాయని ప్రశ్నించారు. దీనిపై విచారణకు బెంచ్ ని ఏర్పాటుచేశారు. ఆయనకు తగిలిన గాయాలు తాజావని తెలిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీ ఏర్పాటు చేయాలి అని ఆదేశించింది. మరోవైపు ఇదంతా ఎంపీ నాటకమని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. మధ్యాహ్నం లేని దెబ్బలు , అప్పుడే ఎలా వచ్చాయని నిలదీశారు. రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ కాగానే ఆయన దెబ్బల డ్రామాకు తెరతీశారని, పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటివరకు కూడా ఆయన మామూలుగానే ఉన్నారని చెప్పారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.