టోల్ గేట్ ఫీజులతో విసిగి పోయిన ఆ ఊరు జనం కొత్త ఆలోచన చేశారు. ఈ కొత్త ఆలోచన ఊహించని టోల్ ప్లాజా యాజమాన్యం నోరు తెరిచింది. టోల్ ప్లాజా పక్కనే తమపొలాల్లో సొంతంగా రోడ్డు వేసుకున్నారు. మారోడ్డు మాఇష్టమంటూ ఆ రోడ్డులో వెళ్లడం మొదలెట్టారు. ఫాస్ట్ ట్యాగ్ విధానం వచ్చిన తర్వాత టోల్ ప్లాజా ఉన్న గ్రామస్థులకు ఇబ్బందిగా మారింది. గతంలో స్థానికులకు టోల్ ఫీజుల నుంచి సడలింపులు ఉండేవి. అయితే ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ లో అలా చేయడం వీలుకాకపోవడంతో.. పంచాయితీలో తీర్మానం చేసుకుని..పొలాల్లో నుంచి సొంతంగా రోడ్డు వేసుకున్నారు.
కర్ణాటకలోని మంగుళూరు – ఉడిపి జాతీయ రహదారిపై హెజమడి అనే గ్రామంలో ఈ పని చేసి.. టోల్ ప్లాజా వారికి బుధ్ధి చెప్పారు. ఇప్పుడు పంచాయితీ రోడ్డుకు టోల్ ఫీజు లేకపోవడంతో, ఆ గ్రామస్థులతో పాటూ.. మిగతా వాహనాలు కూడా అదే రోడ్డులో వెళ్లడం మొదలయ్యాయి. దీంతో జరిగిన నష్టాన్ని గ్రహించిన.. టోల్ ప్లాజా యాజమాన్యం.. గ్రామస్థులతో చర్చించింది. గ్రామస్థులకు ఫాస్ట్ ట్యాగ్ లో మినహాయింపు కల్పించింది. చివరకు ఆ రోడ్డును మూయించింది.