పవన్ కళ్యాణ్ నన్ను కెలికావు.. టైం చూసి చెప్తా..

  0
  519

  జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిని కెల‌క‌కూడ‌దో… అత‌నినే కెలికాడు. ముక్కుసూటిగా, నిర్మోహ‌మాటంగా మాట్లాడే మోహ‌న్ బాబుని. రిప‌బ్లిక్ మూవీ ప్రీ ఈవెంట్ ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ సినిమా థియేట‌ర్లు, చిత్ర ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ‌పై ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ, ప‌నిలో ప‌నిగా మోహ‌న్ బాబు ప్ర‌స్తావ‌న తెచ్చాడు. జ‌గ‌న్ రెడ్డి మీకు బంధువు క‌దా… మీరైనా కాస్త న‌చ్చ‌జెప్పండి అంటూ సూచించారు. అంతటితో ఆగ‌కుండా ఇప్పుడు థియేట‌ర్లు మూసే ప‌రిస్థితి ఎలా వ‌చ్చిందో… భ‌విష్య‌త్తులో మోహ‌న్ బాబు విద్యానికేత‌న్ స్కూల్ ను కూడా మూసే పరిస్థితి వ‌స్తుంద‌నే అర్ధం వచ్చేట్లు ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. హిట్ల‌ర్ సైన్యంలో ఎస్ఎస్ సంఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రించాడు కూడా. అంటే చివ‌రికి నిన్ను కూడా కాపాడేవారు ఎవ‌రూ ఉండ‌రంటూ మోహ‌న్ బాబుకి సూటిగా త‌గిలేలా మాట్లాడారు.

  దీంతో మోహ‌న్ బాబుకి చిర్రెత్తు కొచ్చింది. ప‌వ‌న్ కి సున్నితంగా కౌంట‌ర్ ఇచ్చాడు. “ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కంటే చిన్న‌వాడ‌ని, చాలాకాలానికి న‌న్ను మెల్ల‌గా లాగుతున్నావు. మా ఎన్నిక‌లు అయిన త‌ర్వాత నువ్వు అడిగిన ప్ర‌తి మాట‌కు నేను స‌మాధానం చెప్తా. ఈలోగా నువ్వు చేయాల్సిన ఓ ప‌ని ఒక‌టి ఉంది. మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న విష్ణుకి, అత‌ని ప్యాన‌ల్ కి నీ ఓటు వేయాల‌ని కోరుతున్నాను”. అంటూ ట్వీట్ చేశాడు. ఎప్పుడూ ఖ‌రాఖండీగా మాట్లాడే డైలాగ్ కింగ్… ఇప్పుడు కాస్త నెమ్మ‌దిగానే రియాక్ట్ అయ్యాడు. అందుకు కార‌ణం మా ఎన్నిక‌లే. అక్టోబ‌ర్ 10 మా ఎన్నిక‌ల త‌ర్వాత మోహ‌న్ బాబు, ప‌వ‌న్ పై ఘాటుగా స్పందించే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న ట్వీట్ చూస్తే అర్ధ‌మ‌వుతోంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.