సాయిధరమ్ తేజ్ కోమాలోనే ఉన్నాడా.?

  0
  363

  మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం ప్ర‌స్తుతం ఎలా ఉంది ? ఆయ‌న కోమాలో నుంచి బ‌య‌ట ప‌డ్డారా ? లేక ఇంకా కోమాలోనే ఉన్నారా ? ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు ఉన్న హ‌డావుడి ఇప్పుడు కాస్త నెమ్మ‌దించింది. ఆయ‌న కోలుకుంటున్నార‌ని చికిత్స చేస్తోన్న అపోలో ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు చెప్పారు. కానీ నిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిప‌బ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సాయి ఇంకా కోమాలోనే ఉన్నాడ‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ ఏది నిజం.గచ్చిబౌలీ సమీపంలో రోప్ వేలో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

  స‌రైన స‌మ‌యానికి ఆస్ప‌త్రికి తీసుకురావ‌డంతో ప్రాణ‌పాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. డాక్ట‌ర్లు కూడా ఆయ‌న‌కు మెరుగైన చికిత్స అందిస్తూ వ‌చ్చారు. ఇక మీడియా చేసిన హ‌డావుడి అంతాఇంతా కాదు. డాక్ట‌ర్లు కూడా ప్ర‌తిరోజూ తేజ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ వ‌చ్చారు. ఆయ‌న కాల‌ర్ బోన్ కు స‌ర్జ‌రీ కూడా విజ‌య‌వంతంగా చేశామ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, వెంటిలేటర్.. ఆక్సిజన్ సపోర్ట్ ను తీసేశామ‌ని, సొంతంగా శ్వాస తీసుకుంటున్నార‌ని డాక్టర్లు రీసెంట్ గా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా మాట్లాడని ఆయన ప్రస్తుతం కళ్లు తెరిచి చూస్తున్నారని.. మాట్లాడుతున్నారని కూడా చెప్పారు. డాక్ట‌ర్లు ఆ మాట చెప్పిన త‌ర్వాత నుంచి మీడియా హ‌డావుడి కూడా కాస్త త‌గ్గింది.సాయి ఆస్ప‌త్రిలో ఉంటే, మెగా ఫ్యామిలీ కుటుంబం మొత్తం ఆస్ప‌త్రికి వెళ్ళింది. అంద‌రూ ఆయన త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, త్వ‌ర‌గా డిశ్చార్జి కావాల‌ని ఆకాంక్షిస్తూ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మేన‌ల్లుడిని చూసొచ్చారు.

  అయితే రిప‌బ్లిక్ మూవీ ప్రీఈవెంట్ ఫంక్ష‌న్ లో మాత్రం… సాయిధ‌ర‌మ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడ‌ని చెప్ప‌డం, మెగా ఫ్యాన్స్ తో పాటు సినీప్రియుల‌ను క‌ల‌వ‌రానికి గురిచేసింది. అంత‌కుముందు డాక్ట‌ర్లు మాత్రం సాయి సేఫ్ గానే ఉన్నాడు. క‌ళ్ళు తెరిచాడు, మాట్లాడుతున్నాడు..శ్వాస తీసుకుంటున్నాడు.. అని చెప్పుకొచ్చారు. కానీ ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో… కొత్త ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. సొంత మేన‌మామ‌.. త‌న మేన‌ల్లుడి ఆరోగ్యం గురించి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న చేయ‌డ‌నేది అంద‌రి మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌. అన‌వ‌స‌రంగా మేన‌ల్లుడి ఆరోగ్యం మీద నోరు జారే త‌త్వం కూడా ప‌వ‌న్ ది కాదు. అలాంట‌ప్పుడు ప‌వ‌న్ ఇలా ఎందుక‌న్నాడు ? ఒక‌వేళ డాక్ట‌ర్లు చెప్పిన దాంట్లో కొంత అస్ప‌ష్టత ఉందా.. నిజాన్ని దాచి పెట్టారా ? ఆయ‌న ఆరోగ్యం విష‌యం పెద్ద‌ది కాకుండా చూసేందుకు డాక్ట‌ర్లు ఇలా ప్ర‌య‌త్నించారా ? అని చ‌ర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం గురించి ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న హాట్ టాపిక్ అయింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.