ఎమ్మెల్యే సీతక్క …ఆవేదన చూడండి.. తన తల్లికి ఆరోగ్యం క్షీణించి చావు బతుకుల్లో ఉంటే పోలీస్ అధికారి రక్షిత అమానుషంగా ప్రవర్తించారని సీతక్క ఆరోపించింది. హాస్పిటల్లో ఉన్న తన తల్లికి రక్తం ఇవ్వాలని , పాస్ తీసుకొని తన బంధువులు కారులో పోతుంటే అధికారి ఆపేసింది ఆవేదనవ్యక్తం చేసింది. తాను ఎమ్మెల్యే అని , ప్రాణాపాయంలో ఉన్న తన తల్లికి రక్తం ఇవ్వాలని తగిన అనుమతులతో వారు వస్తున్నారని చెప్పినా వినకుండా కారు ఆపేసి పక్కనపెట్టిందని అన్నారు.. తర్వాత కింది స్థాయి అధికారి కారు పంపారని అన్నారు..
మల్కాజిగిరి డిసిపి రక్షిత మూర్తి అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించిన ఎమ్మెల్యే సీతక్క. ఐసియూలో ఉన్న తల్లికి రక్తం దానం చేయడానికి అనుమతితో వస్తున్న తన కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసిన సీతక్క @TelanganaDGP @seethakkaMLA pic.twitter.com/Hmsu2p8mt0
— DONTHU RAMESH (@DonthuRamesh) June 3, 2021