పెళ్లిమీద పెళ్లి.. మొగుళ్లు గోలగోల

  0
  258

  పెళ్లి చేసుకోవడం, నాలుగు రోజులు కాపురం చేయడం, అందినకాడికి బంగారం, డబ్బులు తీసుకోని చెక్కేయడం. ఇదీ ఆ అమ్మాయి పని. అయితే డబ్బు, నగలు తీసుకుని ఆమె ఎక్కడికీ పారిపోదు. పుట్టింటికి వెళ్లొస్తానంటూ బైబై చెప్పేసి అడ్రస్ లేకుండా పోతుంది. ఆ తర్వాత ఆమెకోసం వేచి చూసీ చూసీ విసిగిపోవడం భర్తల వంతు అవుతుంది. ఎక్కువగా ఇలాంటి పెళ్లిళ్ల స్కామ్ లు ఉత్తరాదిన జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ స్కామ్ చైనాలో బయటపడింది.

  సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిని ఆ యువకుడు అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నాడు. భార్య అడగ్గానే 17లక్షల రూపాయలు ఆమె పేరిట ట్రాన్స్ ఫర్ చేశాడు. వారం రోజులు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లొస్తానంటూ చెక్కేసింది ఆ అమ్మాయి. కొన్నాళ్లు వేచి చూసి విసిగిపోయాడు భర్త. యాదృచ్ఛికంగా సోషల్ మీడియాలో భార్య పెళ్లి వీడియో కనపడేసరికి కంగుతిన్నాడు. మరో వ్యక్తితో తన భార్య పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసుకున్నాడు. అక్కడితో కథ పూర్తి కాలేదు. ఆ తర్వాత మరో ఇద్దర్ని కూడా రెండు నెలల గ్యాప్ లో అలా బురిడీ కొట్టించింది. పాపం ఆ పెళ్లి వీడియోలు బయటపడితే కానీ అసలు విషయం తెలియలేదు. తనలాగే ఆ ముగ్గురూ పెళ్లి సమయంలో భార్యకు భారీగా డబ్బులు ముట్టచెబ్బారనే విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మొదటి భర్త. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు విషయం బయటపడింది. 19మంది గ్యాంగ్ ఇలాంటి పెళ్లిళ్ల స్కామ్ కి పాల్పడుతుందని పోలీసులు తేల్చారు. నలుగురు భర్తలనుంచి ఆ ఎవర్ గ్రీన్ పెళ్లికూతురు 3కోట్ల రూపాయలు కొట్టేసిందని నిర్థారించారు. నిత్య పెళ్లికూతురు దవ, ఆ గ్యాంగ్ ని నడిపించే పెళ్లిళ్ల బ్రోకర్ లీ సహా.. అందర్నీ కటకటాల వెనక్కు పంపించారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..