లంచం అమౌంట్ తగ్గించండి..

  0
  59

  లంచం తీసుకోండి ..కానీ అమౌంట్ తగ్గించండి.. ఇది లంచాల ప్రవచనం . చెప్పింది సాక్షాత్తు ఎమ్మెల్యే రమాబాయి.. ఈమె బీఎస్పీ ఎమ్మెల్యే. మధ్యప్రదేశ్ లో తన నియోజకవర్గంలో సాతువా అనే గ్రామంలో ఇళ్ల నిర్మాణం పై మీటింగ్ పెట్టింది. అధికారులొచ్చారు. లబ్ధిదారులు ఒక్కొక్కరు లేచి , తాము ఎంత లంచం ఇచ్చామో పేరుపేరునా చెప్పారు. లంచం తీసుకున్న అధికారి కూడా అక్కడే ఉన్నారు. అన్నీ విన్న ఎమ్మెల్యే , లంచాల ప్రవచనం మొదలుపెట్టారు. లంచం తీసుకోండి.. తప్పులేదు.. అయితే అంతపెద్ద మొత్తాలు తీసుకోవద్దు. వెయ్యిరూపాయలవరకు ఓకే.. లంచం అనేది కూరలో ఉప్పులాగా ఉండాలి .. గుర్తుపెట్టుకోండి అంటూ ఉపదేశం చేసింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.