సినిమాల్లో పవన్ కి తోడెవరు..?

  0
  184

  పవన్ కల్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు లక్షలాదిగా తరలివచ్చే అభిమానులున్నారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఒంటరిగా మిగిలారా..? ఇండస్ట్రీకి నష్టం కలుగుతుందంటూ ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థపై మాట్లాడిన పవన్ కల్యాణ్ కి అదే ఇండస్ట్రీనుంచి మద్దతు ఎందుకు కరవైంది. నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఆయనకి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడటంలేదు.

  పవన్ కల్యాణ్ ఇ ఆల్రడీ మోహన్ బాబు, బాలకృష్ణతో విభేదాలున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ తోపాటు, నాగబాబు కూడా వీరిపై గతంలో విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో కూడా మెగా ఫ్యామిలీ పరోక్షంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి సపోర్ట్ చేస్తుంటే మంచు విష్ణు ప్యానెల్ కి మిగతావారి మద్దతు ఉంది. సో మోహన్ బాబు, నందమూరి ఫ్యామిలీస్ ఆ విషయంలో పవన్ తో విభేదిస్తూ ఆయనకు మద్దతు తెలిపేందుకు బయటకు రాకపోయి ఉండొచ్చు.

  ఇక చిరంజీవి కూడా ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా మాట్లాడలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోని సమస్యలు పరిష్కరించాలంటూ లవ్ స్టోరీ సినిమా వేదికపైనుంచి చిరంజీవి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడకలో పవన్ కల్యాణ్ మాత్రం కాస్త ఘాటుగా మాట్లాడారు. సామరస్యంగా సమస్య పరిష్కారమవుతుందనుకున్న సమయంలో పవన్ వ్యాఖ్యలు, దానికి ప్రతిగా వైసీపీ మంత్రుల విమర్శలు సంచలనంగా మారాయి.

  సినిమా ఫంక్షన్లో పవన్ సినిమా సమస్యలతోపాటు, రాజకీయాలు కూడా మాట్లాడటం సంచలనంగా మారింది. దీంతో సినిమావాళ్లు.. రాజకీయాలతో మనకెందుకు అనుకుని సైలెంట్ గా ఉన్నారు. దీంతో పవన్ కి సినిమావాళ్ల నుంచి మద్దతు కరువైనట్టు తెలుస్తోంది. అంటే ఇక పవన్ రాజకీయ పరంగానే వైసీపీతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.