ఒక డోస్ అది , రెండో డోస్ ఇది.. ఏమైంది..?

  0
  65

  కోవిడ్ వ్యాక్సిన్ల‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండు క‌లిసిన‌ కాక్ టెయిల్ వ్యాక్సిన్ బాగా ప‌ని చేస్తోంద‌ని త‌మ అధ్య‌య‌నంలో రుజువైంద‌ని ఐసీఎంఆర్ పేర్కొంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 18 మందిపై ఇలాంటి ప‌రిశోధ‌న‌లే చేసింది. దీంట్లో ఈ విధంగా మొద‌టి రెండు డోసుల్లో ఒక‌టి కోవాగ్జిన్, రెండోది కోవిషీల్డ్ వేయించుకున్న వారిలో మంచి ఫ‌లితాలు క‌నిపించాయ‌న్నారు. వారిలో కోవిడ్ వైర‌స్ ను ఎదుర్కొనే శ‌క్తి, వ్యాధి నిరోధ‌క శ‌క్తి బ‌లంగా ఉన్న‌ట్లు గ‌మ‌నించామ‌ని చెప్పారు. దేశ‌వ్యాప్తంగా ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నాలుగో నెల‌కు చేరుకున్న సంద‌ర్భంగా వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంది. గ‌తంలో తెలియ‌క ఒక డోసు కోవాగ్జిన్, రెండోది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిపై జ‌రిగిన ఈ ప‌రిశోధ‌న‌.. ఆ త‌ర్వాత అధ్య‌యానికి దోహ‌ద‌ప‌డింది. రెండు డోసుల్లో వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఆరు వారాల వ్య‌వ‌ధిలోనే మంచి మార్పులు గ‌మ‌నించారు.

  త‌మ అధ్య‌య‌నంలో 12 మంది మ‌హిళ‌లు, 11 మంది పురుషుల‌కు, 62 వ‌య‌సు గ‌ల వారిపై ఈ ప‌రిశోధ‌న‌లు చేశారు. కోవిషీల్డ్ మొద‌టి డోసుగా తీసుకుని, కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న వారిలోనూ, కోవాగ్జిన్ మొద‌టి డోసుగా తీసుకుని, కోవిషీల్డ్ రెండో డోసుగా తీసుకున్న వారిలోనూ.. ఫ‌లితాలు ఒకేర‌కంగా ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ల త‌యారీ ఫార్ములా వేరే అయినా, ఫ‌లితాలు మాత్రం ఆశాజ‌న‌కంగానే ఉన్నాయి. చ‌నిపోయిన వైర‌స్ ఎంజైముల‌తో కోవాగ్జిన్ వ్యాక్సిన్ త‌యారు చేస్తారు. అది శ‌రీరంలోని వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు వైర‌స్ తో పోరాడ‌మ‌ని సిగ్న‌ల్ ఇస్తుంది. కోవీషీల్డ్ వైర‌స్ వెక్ట‌ర్ ఫార్ములా మీద త‌యారు చేశారు. దీనిలో జ‌లుబుకు కార‌ణ‌మైన ఒక బ‌ల‌హీన‌మైన వైర‌స్ ను అభివృద్ది చేసి దానిని కోవిడ్ వైర‌స్ మీద‌కు పోరాడే విధంగా చేస్తుంది. ఈ రెండు వ్యాక్సిన్లు కోవిడ్‌ వైర‌స్ మీద పోరాడేందుకు త‌యారు చేయ‌బ‌డిన‌వే. మ‌రో 60, 70 రోజుల్లో ఇదే అంశంపై మ‌రింత విస్తృత‌మైన ప‌రిశోధ‌న చేప‌డుతున్న‌ట్లు ఐసీఎంఆర్ ఎపిడ‌మాల‌జీ హెడ్ డాక్ట‌ర్ సెమిర‌న్ పాండా తెలిపారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..