ప్రియుడికి పెళ్లి.. హిజ్రా ఆత్మహత్యాయత్నం..

  0
  85

  ప్రేమ .. మోసం , పెళ్లికూతురు ప్రియుడి కల్యాణవేదికకు పోయి అడ్డుకోవడం .. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువే.. అయితే ఈ ట్రెండ్ కు ఇప్పుడో ట్విస్ట్.. తన ప్రియుడు ,వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడని , ఓ హిజ్రా , ఇతర హిజ్రాలతో కలిసి , పెళ్లిమండపంలో గందరగోళం చేసింది.. చివరకు ఆత్మహత్యా యత్నం చేసుకునే పరిస్థితి.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ సంఘటన జరిగింది. పాలకవీడుకి చెందిన మగ్బూల్, పాపినేనిపల్లెకు చెందిన వినీత్‌ చిన్ననాటినుంచి స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆర్మీ సెలక్షన్లలో మక్బుల్ సెలెక్ట్ అయి సైన్యంలో చేరాడు. అయినా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు.

  ఇంటికొచ్చినప్పుడు కలిసే ఉండేవారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వినీత్‌ హిజ్రాగా మారి వినీతగా పేరు మార్చుకున్నాడు. అయినప్పటికీ మగ్బూల్‌తో స్నేహం కొనసాగిస్తూ వచ్చాడు. వారిద్దరి స్నేహాన్ని సహజీవనంగా కూడా మార్చుకున్నారు. మగ్బూల్‌.. గిద్దలూరు పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. శుక్రవారం ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకుంటుండగా, సమాచారం తెలుసుకున్న హిజ్రా వినీత.. పలువురు హిజ్రాలతో కలిసి అక్కడకు చేరుకుని మగ్బూల్‌ వివాహాన్ని అడ్డుకుంది. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మగ్బూల్‌ నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడగా, కర్నూలు జిల్లాలోని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..