చేపను మింగిన చేప.. ఇదో సృష్టి విచిత్రం..

  0
  273

  ఈ ప్రపంచంలో ఉన్న అరుదైన వింత జీవుల్లో జెల్లీ ఫిష్ ఒకటి. జెల్లీ ఫిష్ శరీర భాగం అంతా పూర్తిగా నీటిని ఆధారం చేసుకుని ఉంటుంది. అందుకే అది పారదర్శకంగా ఉంటుంది. సముద్రం అడుగు భాగంలో ఇవి జీవిస్తుంటాయి. అత్యంత విషపూరితమైన చేపలు ఇవి.

  పేరుకి చేపే కానీ ఇది చేపలాగానే ఉండదు. చూడటానికి పట్టుకోడానికి జెల్లీ అనే పదార్థంలా ఉంటుంది కాబట్టి దీనికి జెల్లీ ఫిష్ అనే పేరు పెట్టారు. వీటిలో చాలా రకాలుంటాయి. సహజంగా ఇవి కాంతివంతంగా కనపడతాయి. దీంతో వీటి కడుపులో ఏముందో కూడా ఈజీగా కనిపిస్తుంది. అలాంటి జెల్లీ ఫిష్ ఒకటి ఓ మామూలు చేపను మింగేసింది. ఆ తర్వాత ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దీంతో ఆ చేప, చేప కడుపులో ఉన్న మరో చేప కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..