మిమిచక్రవర్తిని ఒకడు బోల్తా కొట్టించాడు..

  0
  124

  సినీ హీరోయిన్ , తృణమూల్ కాంగ్రెస్ లోక సభ సభ్యురాలు మిమిచక్రవర్తిని ఒకడు బోల్తా కొట్టించాడు.. తాను కలకత్తా కార్పొరేషన్ అడిషనల్ కమీషనర్ నని , ఐఏఎస్ అధికారినని నమ్మించాడు.. హిజ్రాలకోసం కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం పెట్టామని చెప్పాడు.. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరాడు..

  నిజమేనని నమ్మిన మిమి , నేరుగా అక్కడికెళ్లింది.. వ్యాక్సినేషన్ ప్రారంభించి ,ఉపన్యాసం చెప్పింది.. తానూ వాక్సిన్ వేయించుకుంది.. ఇంటికి పోయిన తర్వాత , తాను వాక్సిన్ చేసుకున్నట్టు తనకు మెస్సేజ్ రాలేదని అడిగింది.. సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది.. దీంతో నిర్వాహకులు నీళ్లు నమిలారు.

  పోలీసులను విచారించమంటే ,అసలు విషయం వెల్లడింది.. అదొక బోగస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అని తేలింది.. నిర్వాహకుడు ఐఏఎస్ కాదని , అసలు కార్పొరేషన్ అడిషనల్ కమీషనర్ కాదని తేలింది.. అసలు అక్కడ వేసింది నిజమైన వాక్సినా కాదా అన్న విషయం ఇప్పుడు అనుమానం వచ్చి విచారణకు ఆదేశించింది.. ఇంతకీ అక్కడ తానూ వేయించుకున్న వాక్సిన్ కూడా బోగస్ అయిఉంటుందన్న అనుమానంతో , హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంది..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..