చిరు, బాలయ్య ,ఎవరికి మద్దతు.. ?

  0
  424

  మా'(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారనున్నాయి. గ‌తంలో ఎప్పుడూ ‘మా’ఎన్నిక‌లు స‌జావుగా సాగేవి.కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ‘మా’ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగే అభ్య‌ర్ధులు మ‌ధ్య పోటాపోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌డ‌మే ఇందుకు కార‌ణం. సెప్టెంబర్ మాసంలో ‘మా’ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో… అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న‌ట్లు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాతి రోజే మంచు విష్ణు తాను బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పోటీ రంజుగా సాగుతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపించింది. ఈలోగా జీవితా రాజశేఖ‌ర్ తాను కూడా రంగంలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో.. ముక్కోణ‌పు పోటీ ఖాయంగా క‌నిపిస్తోంది.

  ఈ నేపథ్యంలో పెద్ద స్టార్లు ఎవరికి మద్దతిస్తారు..? ఎవరు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.ఇక ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ త‌న‌కు స‌పోర్ట్ ఉందంటూ ప్ర‌కాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో త‌న విజ‌యానికి ఢోకా లేద‌నే ధీమాతో పీఆర్ ఉన్నాడు. ఇక తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు పోటీలోకి దిగాడు. అంతేగాక ఈ తండ్రీకొడుకులు సూపర్‌ స్టార్‌ కృష్ణ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వంటి ప్రముఖుల‌ను స్వ‌యంగా క‌లుసుకుని మ‌ద్ద‌తు కోరిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు మోహన్ బాబు, చిరంజీవి మధ్య మంచి స్నేహం ఉంది.

  ఈమధ్య మోహన్ బాబు న‌టించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా టీజర్ కు చిరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఈ నేప‌ధ్యంలో చిరు ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తార‌నే అంశం అంద‌రిలోనూ క్యూరియాసిటీ పెంచుతోంది. ఇటు ప్ర‌కాష్ రాజ్ కి ఇచ్చిన మాట‌… అటు మోహ‌న్ బాబుతో ఉన్న స్నేహం… ఇక మెగాస్టార్ ఫ్యామిలీ ఎటువైపు ఉంటుందోననే చర్చ ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది.చిరంజీవి మద్దతు ఎటు ఉంటే వాళ్లే గెలుస్తారనే నమ్మకం గత ఎన్నికలు రుజువు చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

  మ‌రోవైపు బాల‌కృష్ణ మ‌ద్ద‌తు కూడా మోహ‌న్ బాబు తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకే సామాజిక వ‌ర్గం కూడా మంచు ఫ్యామిలీకి ఇక్క‌డ క‌లిసొచ్చే అంశం. మ‌రో విష‌యం ఏమిటంటే… జీవిత రాజ‌శేఖ‌ర్ కూడా బాల‌య్య మ‌ద్ద‌తు కోరిన‌ట్లు తెలిసింది. ఆయ‌న మ‌ద్ద‌తుతోనే ‘మా’అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న‌ట్లు వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. మ‌రి ఇందులో నిజ‌మెంత అనేది తెలియాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ముక్కోణ‌పు పోటీ వ‌ల్ల టాలీవుడ్ మూడు వ‌ర్గాలుగా చీలిక‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..