కరోనా విజృంభణ టైం లో రెమిడీస్ వీర్ ఇంజెక్షన్ల కు డిమాండ్ అంతాఇంతాకాదు.. 3 వేల రూపాయల ఈ ఇంజెక్షన్ 70 వేలవరకు బ్లాక్ లో అమ్మిన నీచుల్లో డాక్టర్లు , రాజకీయనాయకులు , అధికారులు , హాస్పిటల్ ఉద్యోగులు , మందుల షాపుల వాళ్ళు.. ఇలా చాలామంది ఉన్నారు. అప్పట్లో అది ఎంతవరకు పనిచేసిందోగాని బ్లాక్ మార్కెటీర్లకు మాత్రం కోట్లరూపాయల డబ్బు తెచ్చిపెట్టింది. కొన్ని ఆసుపత్రుల్లో అయితే రెమిడీస్ వీర్ అని చెప్పి విటమిన్ లు కలిసిన లేదా మామూలు యాంటిబయాటిక్ ఇంజెక్షన్లు ఇచ్చేసి , బ్లాక్ మార్కెట్ లోనే వేల రూపాయలు సంపాదించిశారు . కరోనా వైద్యంలో రెమిడీస్ వీర్ ఇంత కల్లోలం సృష్టించింది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ మెర్క్ దానికి ప్రత్యమ్నాయంగా ఒక క్యాప్సుల్ తయారు చేసింది. ఇది కరోనా వైరస్ కారణంగా జబ్బు తీవ్రమై ఆస్పత్రిలో చేరే పరిస్థితి వచ్చిన వాళ్ళకి ఆశా జనకంగా ఉంది.
క్లినికల్ ట్రయల్స్ లో ఈ మాత్ర ఉపయోగించిన తర్వాత వైరస్ లోడు గణనీయంగా తగ్గిందని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందని జాన్ హాప్ కిన్స్ ప్రతినిధి చెప్పారు. ఈ ట్యాబ్లెట్ లో యాంటీ వైరల్ డ్రగ్, జెనరిక్ స్టెరాయిడ్ రెండూ కలిపి ఉన్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో చేరిన వారి మీద ఈ ట్యాబ్లెట్ ను ఉపయోగించారు. రెమిడిసీవర్ ఇంజక్షన్ కంటే ఇది అద్భుతంగా పని చేసిందన్నారు. మూడో దఫా క్లినికల్ ట్రయల్స్ లో కూడా ఈ ట్యాబ్లెట్ ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి రానుంది.
ఇప్పటివరకు దీన్ని 775 మంది పేషంట్ల మీద ప్రయోగించి, ఫలితాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో 8 మంది చనిపోయారు. వారు కూడా తీవ్రమైన ఇతర అనారోగ్య సమస్యలపై బాధ పడుతున్నారు. ఈ ట్యాబ్లెట్ ప్రయోగించే నాటికి, వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. యాంటీ వైరల్ ట్రీట్మెంట్ కోసం లక్షల ఖర్చుపెట్టుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. కేవలం మాత్రతోనే వైరస్ ను అదుపు చేసుకునే మంచి మార్గం. ఈ సంవత్సరాంతానికి దాదాపు కోటి డోసులు విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఈ ట్యాబ్లెట్స్ ఒక కోర్సుకు 4900 రూపాయల ఖర్చు అవుతుంది.