బ్యాంకులకే కాదు.. లవర్ కీ టోపీ పెట్టాడు..

    0
    3568

    మనదేశంలో బ్యాంకులకు 13500 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయిన మెహుల్
    చోక్సీ తన ప్రియురాలు జరాబికాని ఎలా మోసం చేశాడో తెలుసా..? ఇంత పెద్ద దేశాన్నే మోసం చేసి పోయిన వాడికి, ప్రియురాలిని మోసం చేయడం ఒక లెక్కా అనుకోక తప్పదు. మనదేశం నుంచి పారిపోయి కరేబియన్ దీవి అయిన డొమినికాలో తలదాచుకున్న చోక్సీని చివరకు జరాబికా సాయంతోనే పోలీసులు పట్టుకోవడం విచిత్రం.
    ప్రియురాని ఎలా మోసం చేసాడంటే..?
    బంగారం, వజ్రాల వ్యాపారి అయిన మెహుల్ చోక్సీ, తన ప్రియురాలు జరాబికాకి వజ్రాల బ్రేస్ లెట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అది చాలా విలువైనదని, దాని విలువ లెక్కలకు కూడా అందదని ప్రియురాలికి చెప్పాడు. అయితే తనకిచ్చిన బ్రేస్ లెట్ ని ప్రముఖ వజ్రాల దుకాణాల్లో చూపిస్తే, అవన్నీ నకిలీ రాళ్లని, అసలు వజ్రాలే కావని చెప్పారని ఆమె చెప్పింది. మెహుల్ చోక్సీ తనను ఇంత దారుణంగా మోసం చేస్తాడని తాను అనుకోలేదని జరాబికా చెప్పింది. చాలా వేధింపులు, ప్రేమ సందేశాల తర్వాత తాను లేకపోతే చనిపోతానని, తనని గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాతే తాను చోక్సీతో సంబంధం పెట్టుకున్నానని తెలిపింది. ఇప్పుడు చోక్సీని పోలీసులు పట్టుకోవడంలో తన పాత్ర ఉన్నట్టు అతను చెప్పడం సరైనది కాదని, ప్రేమ పేరుతో తనకి నకిలీ వజ్రాల బ్రేస్ లెట్ ఇచ్చి తనను మోసం చేశాడని, శారీరకంగా కూడా తనను వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..