మ్యాథ్య్ అంటే మీ పిల్లలకు ఇష్టమా..? కష్టమా..?

    0
    76

    స్కూల్స్ లో మ్యాథ్య్ సబ్జెక్ట్ కష్టమని దాన్ని వదిలేసే పిల్లలు నిజంగా తెలివైనవారా..? అలా వదిలేయడం వల్ల వారి మేథస్సులో మార్పు ఉంటుందా..? మెదడులో కొన్ని రసాయనాలు ఉత్పత్తి కావా..? ఈ విషయంలో ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు చేసిన సుదీర్ఘ పరిశోధనలో ఆసక్తికర విషయాలు తేలాయి. స్కూల్స్ లో 16ఏళ్లకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ని వదులుకునే పిల్లల్లో మేథస్సు అభివృద్ధి చెందడంలో కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని. హైస్కూల్ స్థాయిలో మ్యాథ్స్ సబ్జెక్ట్ పై ఆసక్తి ఉన్న పిల్లల మెదడులో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయని ఈ పరిశోధనలో తేలింది.

    గమ్మా-అమినో గుటెరిక్ యాసిడ్ అనేది జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమైన రసాయనం. దీనివల్లే ఆ సబ్జెక్ట్ నేర్చుకునే విధానం, సమస్యను పరిష్కరించే పరిజ్ఞానం ఆధారపడి ఉంటుంది. ఈ రసాయనం మెదడులో ఉత్పత్తి అయితే వారి మేథస్సు కూడా పెరుగుతుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంట్రస్ట్ ఉండేవారిలో ఈ రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆల్జీబ్రా, ఫ్రాక్షన్స్, మెంటల్ అరిథమెటిక్, ఇలాంటివన్నీ తలనొప్పిగా భావించి కొంతమంది పిల్లలు హైస్కూల్ స్టేజ్ లోనే వాటిని వదిలేస్తారని అటువంటి వారి మెదడులో ఆ రసాయనం ఉత్పత్తి కాకుండా మేథస్సుని దెబ్బతీస్తుందని చెప్పారు. ఇందుకోసం 8వేలమంది స్టూడెంట్స్ పై 19నెలలపాటు పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు.

    మ్యాథ్స్ సబ్జెక్ట్ పై కసరత్తు చేసేవారిలో లాజిక్, రీజనింగ్ విషయాల్లో మేథమ్యాటిక్స్ సొల్యూషన్స్ లాగే ఆలోచిస్తారని, అందువల్లే కాంపిటీటివ్ పరీక్షల్లో మ్యాథ్స్ పై ఆసక్తి ఉన్న పిల్లలే ఎక్కువ శాతం విజయం సాధిస్తారని చెప్పారు. ప్రపంచంలో అత్యథిక ఐక్యూ పవర్ ఉన్నవారిలో ఆల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హ్యాకింగ్ కి 160 ఐక్యూ ఉంది. ఇలాంటి వారంతా మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగినవారే కాబట్టి ప్రపంచంలో ప్రసిద్ధులయ్యారు.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..