ప్రకృతి కన్నెర్ర జేస్తే ఇలాంటి దారుణాలే..

  0
  626

  అప్ప‌టివ‌ర‌కు అందంగా క‌నిపించిన న‌గ‌రం… నిమిషాల్లో కుప్ప కూలిపోయింది. క్ష‌ణంలో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డ‌డంతో ఆ న‌గ‌రంలోని వీధుల‌న్నీ నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి, ప్ర‌కృతి విల‌య‌తాండ‌వానికి ఇదో సాక్ష్యం. జ‌పాన్ లోని షిజుకా, అట‌మి న‌గ‌రాల్లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో ప‌క్క‌నే ఉన్న కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. కొన్ని ల‌క్ష‌ల ట‌న్నుల బండ‌రాళ్ళు, మ‌ట్టి, వ‌ర‌ద‌నీరు న‌గ‌రాల‌ను ముంచెత్త‌డంతో భ‌వ‌నాలు, ఇళ్ళు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ మ‌హావిల‌యంలో 20 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. దీంతో జ‌పాన్ ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించింది. రోడ్ల మీద పెద్ద ఎత్తున బండ‌రాళ్ళు, బుర‌ద మ‌ట్టి పేరుకుపోయింది. మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. వీడియో కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.