ఫేస్ బుక్ నుంచి 22లక్షలు కొట్టేశాడు..

    0
    2754

    ఇరవయ్యేళ్ల వయసున్న ఈ కుర్రాడు ఫేస్ బుక్ నుంచి ఏకంగా 22 లక్షలు కొట్టేశాడు. కొట్టేశాడు అంటే.. అదేదో అక్రమంగా తెచ్చుకున్నాడనుకోవద్దు. అతని టాలెంట్ ని మెచ్చుకుని ఫేస్ బుక్ ఆ గిఫ్ట్ ఇచ్చింది. ఆ కుర్రాడి పేరు మయూర్ ఫర్తాడే
    ఇంతకీ ఏంచేశాడు..?
    మయూర్ ఫర్తాడే. మహారాష్ట్రలోని షోలాపూర్ కుర్రాడు. సోషల్ మీడియాతో ఎంజాయ్ చేసే వయసున్న ఈ కుర్రాడు, ఆ పని చేస్తూనే ఓ బగ్ ని కనిపెట్టాడు. సహజంగా ఇన్ స్టా గ్రామ్ లో మన ఐడీ ఎవరికీ కనపడకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని మనం యాక్సెప్ట్ చేస్తేనే మనకి సంబంధించిన ఫొటోలు, పోస్టింగ్ లు అవతలివారు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే ఓ చిన్న సమస్య ఉంది. రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయకుండానే ఇన్ స్టా లో మన సమాచారం అవతలివారు చూసే అవకాశం ఉంది. దీన్ని కనిపెట్టాడు మయూర్ ఫర్తాడే. ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయకుండానే అవతలి వారి ఫొటోలు, పోస్టింగ్ లు చూసే బగ్ ని కనిపెట్టాడు. అంతే కాదు, దానికి సంబంధించిన సమాచారాన్ని ఇన్ స్టా నిర్వాహకులకు తెలియజేశాడు. ఇంకేముంది ఆ బగ్ ని కనిపెట్టినందుకు, ఆ తప్పు సరిదిద్దుకునేలా చేసినందుకు ఏకంగా 22లక్షల బహుమతి అందుకున్నాడు. ఇన్ స్టా,ఫేస్ బుక్ యాజమాన్యం ఈ బహుమతుని మయూర్ కి అందజేసింది. దీంతో మయూర్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..