అమెరికా వెళ్తున్న రజినీకాంత్..

  0
  187

  సూపర్ స్టార్ రజినీకాంత్ అమెరికా వెళ్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో అన్నాత్తే సినిమా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురైన రజినీ.. ఆ తర్వాత కొన్నాళ్లు ఇంటి వద్దే రెస్ట్ తీసుకున్నారు. అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకోవాలనుకుంటున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో.. ఆయన ఇ్పటి వరకు వెళ్లలేకపోయారు. తాజాగా అమెరికా ప్రభుత్వం అనుమతివ్వడంతో రజినీ వైద్యం కోసం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 21న ప్రత్యేక విమానంలో రజినీకాంత్ అమెరికా వెళ్తారు.
  అల్లుడు ధనుష్ అక్కడే..
  ప్రస్తుతం ఓ సినిమా షూటంగ్ కోసం రజినీ అల్లుడు ధనుష్.. అమెరికాలోనే ఉన్నారు, రజినీ కుమార్తె కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు రజినీ వారి వద్దకు వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉండబోతున్నారు. మొత్తం 14మంది ప్రయాణించే వీలున్న ఓ ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ని అద్దెకు తీసుకుంటున్నారు. అందులో రజినీతోపాటు.. మరికొంతమంది కుటుంబ సభ్యులు వెళ్తారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..