33 ఏళ్ళ తరువాత మనుషుల మధ్యకు వచ్చాడు..

    0
    5682

    ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవరికి ఉండదు. అద్భుతమైన ప్రకృతి కనిపిస్తే అక్కడే ఉండిపోవాలని అనుకుంటాం. అందులోనూ అందమైన దీవి కనిపిస్తే అక్కడే మకాం వేయాలని కూడా భావిస్తాం. కానీ జనసంచారం లేని ప్రాంతంలో ఎల్లకాలం ఉండడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇతను మాత్రం అందరిలాంటి వ్యక్తి కాదు. తనకు నచ్చిన సుందర ప్రదేశంలో, ప్రకృతి సోయగాల నడుమ ఏకంగా మూడు దశాబ్దాలు గడిపేశాడంటే ఆశ్చర్యం కలగకమానదు.

    అతనే మారో. 33 ఏళ్ళు మనుషులు లేని ఓ దీవిలో ఒంటరి జీవితం గడిపిన మారో అనే వ్యక్తి, ఇటీవల నగర ప్రవేశం చేశాడు. 1989లో పొలినేషియా పడవ ప్రయాణం చేస్తూ లామెడలినా అనే ఐల్యాండ్ లో కాసేపు దిగాడు. ఆ దీవిలో నిశబ్ద వాతావరణం, పక్షుల కిలకిలరావాలు… పరిశుభ్రమైన వాతావరణం.., స్వచ్చమైన గాలి… వంటి ఆకర్షణతో అక్కడే ఉండిపోయాడు.

    మానవ మనుగడ లేని ఈ దీవిలో 33 ఏళ్ళు ఉండిపోయాడు. ఎవరైనా, ఎప్పుడైనా.. సముద్రయానం చేసేవాళ్ళు, టూరిజం కోసం దీవులకు వచ్చేవాళ్ళు… మారోకు తినడానికో… తాగడానికో.. కొన్ని పదార్ధాలు అందించేవారు. ఇప్పుడు ఆయనకు 82 ఏళ్ళు. ఇటీవల అధికారులు ఆ దీవిలో పర్యావరణ సంబంధమైన యంత్రాలు పెడుతున్నామని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళాలని మారోను కోరారు.

    .దీంతో మారో నగర ప్రాంతానికి రావాల్సి వచ్చింది. 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ జనజీవనంలోకి అడుగుపెట్టాడు. ఇంతకాలం తర్వాత మనుషులతో మాట్లాడడం కూడా తనకు కొత్తగా ఉందని మారో చెప్తున్నాడు.

    కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని తెలిపాడు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, నగరానికి వచ్చిన తర్వాత 50 ఏళ్ళ క్రితం నాటి తన గర్ల్ ఫ్రెండ్ ని వెతికి పట్టుకుని, తనకు తోడుగా తెచ్చుకున్నాడు. దీవిలో ఒంటరి బతుకుపై ఇప్పుడు ఓ పుస్తకం కూడా రాయబోతున్నాడు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.