భర్తను చంపి హోమగుండంలో తగలబెట్టిన కసాయికి ..

  0
  2654

  ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. స్పృహలో లేని భర్తను పవిత్రమైన యజ్ఞగుండంలో వేసి కాల్చేసిన కిరాతకురాలు రాజేశ్వరి.. ఆమె ప్రియుడు నిరంజన్, ఆమె కొడుకు నవనీత్ షెట్టి లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కోర్టు తీర్పు చెప్పింది.

  ఐదేళ్ల క్రితం ఉడిపిలో కోటీశ్వరుడు భాస్కర్ షెట్టిని ఆయన భార్య, కొడుకు, భార్య ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేశారు. మృతుడికి దేశవిదేశాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. కోట్లాది రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి. ప్రియుడు నిరంజన్ ఆమె కంటే చిన్నవాడు.. దాదాపుగా ఆమె కొడుకు వయసున్న వాడు..

  జ్యోతిష్యం పేరుతో నిరంజన్ ఆమెకు దగ్గరయ్యాడు. మెల్లగా అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భాస్కర్ షెట్టికి తెలియడంతో భార్యను మందలించాడు. ప్రియుడికి లక్షల రూపాయలు దోచిపెడుతోందని కూడా తెలిసింది. దీంతో భార్యను మరోసారి హెచ్చరించాడు.

  ఐదేళ్ల క్రితం జూలై 18 వ తేదీన భాస్కర్ ఇంట్లో ఉండగా.. భార్య ప్రియుడు నిరంజన్.. అతడిపై పెప్పర్ స్ప్రే కొట్టి.. రాడ్డుతో తలపై కొట్టి.. స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత అతడిని కారు డిక్కీలో వేసుకొని.. ప్రియుడి ఇంట్లోని యజ్ఞగుండం వద్దకు తీసుకెళ్లి.. ఆ హోమగుండంలో భాస్కర్ ను వేసి.. కర్పూరం, వేసి కాల్చేశారు. ఆ తర్వాత ఎముకలను నదిలో కలిపేశారు.

  భాస్కర్ షెట్టి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి.. నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. తాజాగా కోర్టు వీరందరికీ యావజ్జీవ శిక్ష విధించింది.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..