బ్రాందీ షాపు ముందే పెళ్లి .ఎందుకో తెలుసా ?

    0
    5065

    పెళ్లి అంటే మ్యారేజ్ హల్లోనో , ఇంట్లోనో , గుళ్ళోనో చేసుకుంటారు.. కానీ కేరళలో ఓ జంట తమ పెళ్లిని బ్రాందీ షాపు ముందు చేసుకుంది.. వధూవరులిద్దరూ మందుబాబుల సాక్షిగా పెళ్లిచేసుకున్నారు. మందు కొట్టినవారు , మందు కోసం క్యూలో నిలబడ్డ వారి సాక్షిగా పెళ్లి అయింది.. అక్షింతలు కూడా వేశారు.. లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుంటామంటే 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదంటారు. ఇంట్లో అంత్యక్రియలంటే 20 మందికంటే ఎక్కువ వద్దంటారు.. కానీ బ్రాందీ షాపు వద్ద అయితే ఎన్ని వేలమందినైనా పిలుచుకోవచ్చు .. అందుకే ఎవరి అనుమతి అవసరంలేని , ఆహ్వానితులపై పరిమితి లేని బ్రాందీ షాపుముందు పెళ్ళిచేసుకుంటే ఇబ్బందే లేదుకదా ..అన్న ఆలోచన బ్రహ్మాండం .. ఇంతకీ ఈ ఆలోచన చేసిందెవరో తెలుసా..? కేరళ కేటరింగ్ అసోసియేషన్ .. లాక్ డౌన్ టైం లో ప్రభుత్వ నిబంధనలవల్ల పనుల్లేక ఆకలి చావులు చోటుచేసుకున్నాయని అన్నారు. మద్యం షాపులకు లేని నిబంధన పెళ్ళిలకు ఎందుకని వాళ్లు నిలదీసారు.. అందుకే తమ నిరసనను ఇలా తెలిపామని అన్నారు.. ఐడియా బాగుంది కదా..?

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.